Home / క్రైమ్
నిత్యం పూజలు చేస్తూ భక్తిలో మునిగి తేలే అర్చకుడు ఓ మహిళని చంపేశాడు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి వివరాలివి. హైదరాబాద్ సరూర్ నగర్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయి సూర్య కృష్ణకి ఆలయంలో పరిచయం అయిన అప్సర అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ముంబైలో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శరీర భాగాలను కట్టర్తో ముక్కలుగా చేసి, ఆపై కుక్కర్లో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ముంబైలోని మీరా రోడ్లో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికులు మధ్య వచ్చిన తగాదాలు దారుణ హత్యకు దారితీసింది. ప్రేమించిన యువకుడి చేతిలో హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. బెంగళూరు నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు.
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాని వట్టి చెరుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.
కన్నకుమార్తెను సినీ రంగంలోకి పంపించాలనే మోజుతో ఓ తల్లి చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ చేయాలనే ఆశతో.. చిన్నారిని త్వరగా పెద్ద దాన్ని చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది.
ఒడిశాలో జరిగిన మహా విషాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇండియన్ రైల్వే చరిత్రలో అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందీ ఈ సంఘటన. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు.