Home / ఆటోమొబైల్
భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గత నెలలో 1.87 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సోమవారం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల పంపకాలు 3,55,043 యూనిట్లుగా ఉన్నాయి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రపంచంలోనే మొట్టమొదటి BS6 స్టేజ్ II హైబ్రిడ్, ఇథనాల్-ఆధారిత ఇన్నోవాను ఆవిష్కరించారు. ఇది 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది.
దేశం యొక్క మొట్టమొదటి కార్ల క్రాష్-టెస్టింగ్ సేఫ్టీ రేటింగ్ , భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ( ఎన్‌సిఎపి)ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. భారత్ ఎన్‌సిఎపి మన ఆటోమోటివ్ పరిశ్రమను ఆత్మనిర్భర్‌గా మార్చడంలో, భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 ఆటోమొబైల్ హబ్ గా మార్చడంలో కీలకమని గడ్కరీ అన్నారు.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగే కార్యక్రమంలో మంగళవారం మహీంద్రా కొత్త కాన్సెప్ట్ కార్లను ప్రదర్శించనుంది. వీటిలో కంపెనీ థార్ SUV యొక్క సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రదర్శించాలని భావిస్తున్నారు. 'e' అంటే ఎలక్ట్రిక్‌ని సూచించే Thar.e కోసం కంపెనీ ఇప్పటికే కొన్ని టీజర్లను విడుదల చేసింది.
జూలైలో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 1.77 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో సంవత్సరానికి 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ప్రకారం త్రీవీలర్లు రికార్డు స్థాయిలో 74 శాతం వృద్ధిని సాధించాయి.
భారతదేశంలో దేశీయ ప్యాసింజర్ వాహనాల (PV) విక్రయాలు సంవత్సరానికి (y-o-y) 3.1 శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి, జూలైలో వీటి విక్రయాలు 352,492 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (SUVలు) ఎక్కువగా ఉన్నాయి.
ఇటీవల విడుదల చేసిన ట్రయంఫ్ స్పీడ్ 400 బుకింగ్ మొత్తాన్ని రూ.2,000 నుంచి రూ.10,000కి పెంచినట్లు ఆటోకార్ ఇండియా (ఏసీఐ) నివేదించింది. 2.33 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ బైక్ జూలై 5న విడుదలైంది. కస్టమర్లను ఆకర్షించడానికి, స్పీడ్ 400 యొక్క మొదటి 10,000 యూనిట్ల ధర రూ. 10,000 తగ్గింపుతో రూ. 2.23 లక్షలుగా నిర్ణయించారు. బుకింగ్‌లు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మొదటి 10,000 బైక్‌లు అమ్ముడయ్యాయి.
టాటా మోటార్స్ తన ప్రముఖ మైక్రో-ఎస్యూవీ టాటా పంచ్ ను సిఎన్జి వేరియంట్ కు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. టాటా పంచ్ కోసం సిఎన్జి మోడల్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. పండుగ సీజన్‌కు ముందు ఇది లాంచ్ జరిగే అవకాశం ఉందని ఆటోకార్ ఇండియా (ఎసిఐ) నివేదించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ మంగళవారం తన హంటర్ 350 మోటార్‌సైకిల్ 200,000 యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయని తెలపింది. ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. హంటర్ ఆగస్ట్ 2022లో లాంచ్ అయింది. ఫిబ్రవరి 2023లో 100,000-సేల్స్ మార్క్‌ను తాకింది. రిటైల్ ప్రారంభమైన ఆరు నెలలకే. ఇది ఐదు నెలల్లో తదుపరి 100,000-అమ్మకాల మైలురాయిని పూర్తి చేసింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ నుండి హిలక్స్ పికప్ ట్రక్ యొక్క మొదటి బ్యాచ్ వాహనాలనును ఇండియన్ ఆర్మీ అందుకుంది. ఈ వాహనాలను ఫ్లీట్లోకి చేర్చాలని నిర్ణయించే ముందు ఈ వాహనాన్ని భారత సైన్యం యొక్క టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ యొక్క నార్తర్న్ కమాండ్ రెండు నెలల కఠినమైన పరీక్షలు నిర్వహించింది.