Last Updated:

Dzire Crash Test: భద్రతకు భరోసా.. చరిత్ర సృష్టించిన కొత్త డిజైర్.. సేఫ్టీలో సరికొత్త రికార్డ్..!

Dzire Crash Test: భద్రతకు భరోసా.. చరిత్ర సృష్టించిన కొత్త డిజైర్.. సేఫ్టీలో సరికొత్త రికార్డ్..!

Dzire Crash Test: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ చరిత్రను సృష్టించింది. కంపెనీ కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందు ఈ కారు పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచే విధంగా మారుతి సుజుకి డిజైర్ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీంతో మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారుగా నిలిచింది.

GNCAP (గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) అనేది అంతర్జాతీయ స్థాయిలో కార్ల భద్రతను అంచనా వేసే సంస్థ. ఇదే సంస్థ గతంలో మారుతీ సుజుకికి చెందిన పలు కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. గతంలో మారుతీ కార్లు 1-స్టార్, 2-స్టార్‌లను పొందిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ మారుతీ కారుకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వలేదు.

మారుతి సుజుకి డిజైర్ మాత్రమే ఇప్పుడు గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్  అడల్ట్ సేఫ్టీ విభాగంలో 34కి 31.24 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది పిల్లల సేఫ్టీలో 42 పాయింట్లకు 39.20తో 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది. మారుతీ చరిత్రలో ఇదో కొత్త మైలురాయిగా చెప్పుకోవచ్చు.

మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది కంపెనీ నుండి నాల్గవ తరం కారు. ఒక కారు ఎక్కువ కాలం మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే, పోటీని తట్టుకునేందుకు కొత్త అప్‌డేట్‌లతో మళ్లీ విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే కొత్త అప్ డేట్స్ తో నాలుగోసారి రిలీజ్ చేస్తున్నారు.

ఈ విధంగా నాల్గవ తరం డిజైర్ అనేక భద్రతా ఫీచర్లతో విడుదలవుతుంది. కారు 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను కలిగి ఉంటుంది. గ్లోబల్ NCAP ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను ఇచ్చింది ఎందుకంటే కొత్త ‘మారుతి సుజుకి డిజైర్’ ప్రయాణీకులను రక్షించడానికి గరిష్ట భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడవ తరం డిజైర్ కేవలం 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే పొందింది. నాల్గవ తరం కారులో ఉన్న భద్రతా ఫీచర్లు మూడవ తరం డిజైర్‌లో లేవు. కొత్త కారు గరిష్ట భద్రతా ప్రమాణానికి ఇది ప్రధాన కారణం కావచ్చు. అలానే కారు ఎక్ట్సీరియర్ నిర్మాణం కూడా ఈసారి మెరుగ్గా ఉంది.

కారు ఇంకా లాంచ్ కాలేదు, ధర ఖరారు కాలేదు. కంపెనీ నాల్గవ తరం డిజైర్‌ను ఇప్పుడే ఆవిష్కరించింది. వాస్తవానికి మారుతి డిజైర్ ఈసారి స్వల్ప ధరల పెంపుతో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రయిస్తున్న డిజైర్ (మూడవ తరం కారు) ధర రూ.6.57 లక్షలు. ధర (ఎక్స్-షోరూమ్). కొత్త తరం డిజైర్ ధర దాదాపు రూ.70 వేల నుంచి రూ 1 లక్ష వరకు అధికంగా ఉంటే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 11న మారుతి కొత్త డిజైర్‌ను అధికారికంగా విడుదల చేయనుంది.