Home /Author Guruvendhar Reddy
Earthquake Shakes Andhra Pradesh: ఏపీలో మళ్లీ భూంకపం సంభవించింది. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వరుసగా మూడో రోజు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10.34 నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది ఏం జరుగుతుందో అర్ధం కాక ఇబ్బందులు పడ్డారు. అలాగే తాళ్లూరు మండంలో స్వల్పంగా భూమి కంపించింది. […]
Kadapa MLA Madhavi Reddy Vs Mayor Suresh Babu: కడప కార్పొరేషన్లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. సర్వసభ్య సమావేశం వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ వేసి ఎమ్మెల్యేకు వేయకపోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు ఎందుకు కుర్చీ వేయలేదని మాధవరెడ్డి ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేదికపైకి వెళ్లి మేయర్ సురేష్‌తో ఎమ్మెల్యే మాధవరెడ్డి వాగ్వాదానికి దిగారు. గత సమావేశంలో కూడా ఇదే అంశంపై మేయర్, ఎమ్మెల్యేల […]
Brazil Plane Piloted By Top Businessman Crashes In Tourist City atleast 10 Killed: బ్రెజిల్లో ఘోర విషాదం.చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని టూరిస్ట్ సిటీ గ్రామాడోలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విమానం ఏకంగా ఇళ్లను ఢీకొట్టుకుంటూ దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. పర్యాటకులతో గాల్లోకి వెళ్లిన విమానం తొలుత ఓ భారీ […]
Poisonous Gases At Parawada Pharma City: అనకాపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విషవాయువులు లీకయ్యాయి. రక్షిత డ్రగ్స్‌లో ఒక్కసారిగా విష వాయువు లీక్ కావడంతో కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో విషవాయువు పీల్చిన నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆ నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే హైడ్రోజన్ సల్ఫైడ్ లీకైనట్లు గుర్తించారు. […]
PM Narendra Modi receives Kuwait’s highest honour: ప్రధాని నరేంద్ర మోదీకి మరో పురస్కారం వరించింది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’తో సత్కరించింది. ఈ అవార్డును కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా ప్రధాని మోదీకి అందజేశారు. అయితే, ఇప్పటివరకు ప్రధానమంత్రి […]
PV Sindhu to marry fiance Venkata Datta in Udaipur: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11.30 గంటలకు సంప్రదాయ రీతిలో పెళ్లి జరిగింది. వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగనున్నది. దీనికి […]
Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, […]
AP Deputy CM Pawan Kalyan visit to krishna district today: నేడు కృష్ణా జిల్లాలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడవర్రు గ్రామంలో పర్యటించి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన పనులను […]
India Vs Bangladesh U19 Women’s Asia Cup Final: అండర్ 19 ఆసియా కప్‌ను భారత్ ముద్దాడింది. ఫైనల్ వరకు తగ్గేదేలే అంటూ భారత అమ్మాయిలు దూసుకొచ్చారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మన అమ్మాయిలు అదరగొట్టారు. కాగా, అండర్ 19లో తొలిసారి నిర్వహించిన ఆసియా కప్‌ను భారత్ జట్టు సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన […]
Komatireddy Venkat Reddy Reaction on allu arjun statements: సినీ నటుడు అల్లు అర్జున్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడడం సరికాదన్నారు. తన ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేదన్నారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అలా ఎదురుదాడిగా దిగడం ఏంటని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ […]