Home /Author Jyothi Gummadidala
ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్‌పై గైక్వాడ్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్ మహిళలకు క్షమాపణలు తెలిపారు.
పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటూ ఉన్న నలుగురు చిన్నారులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అలాంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ ను ఇంటి నుంచి బయటకు రావద్దంటూ గృహనిర్బంధం చేశారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
లంగాణలో మాంసం వినియోగం విపరీతంగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
ఆదివారం రాగానే అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. బిగ్ బాస్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అని అందరిలో కుతూహలం ఉంటుంది. కాగా ఈ సారి ఎలిమినేషన్స్ కి సంబంధించిన రౌండ్ మొదలటయ్యే సరికి ఆదిరెడ్ది, ఫైమా, రోహిత్, రాజ్ డేంజర్ జోన్లో ఉన్నారు.