Home /Author anantharao b
ఇండోర్‌కు చెందిన యష్ సోనాకియా గ్లాకోమావ్యాధి కారణంగా ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే అతని కలనుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అతనికి దాదాపు రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్‌తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.
ఆదాయపు పన్ను శాఖ కోల్‌కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది.
ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమకావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.
ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లువిడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ. 2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60) లకు కేంద్రం ఈ గ్రాంట్లు విడుదల చేసింది.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పై పంజాగుట్ట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, నగరంలోని ఓ హోటల్ లో తనపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత అదంతా రికార్డు
సూరత్‌లోని కతర్గామ్ ప్రాంతంలో గణపతి ఆకారంలో ఉన్న వజ్రం ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి అట్రాక్షన్ గా నిలుస్తుంది. 500 కోట్ల రూపాయల విలువైన ఈ 27 క్యారెట్ల వజ్రాన్ని 16 సంవత్సరాల క్రితం పాండవ్ కుటుంబీకులు కనుగొన్నారు.
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం మరియు అతని ముఖ్య సహచరులకోసం నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నగదు రివార్డును ప్రకటించింది. దావూద్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.25 లక్షలు, ఛోటా షకీల్‌కు రూ.20 లక్షలు అందజేస్తారు.
ప్రభుత్వం డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కి పెంచింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ఎగుమతులపై పన్ను కూడా సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా లీటరుకు 2 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచబడింది.
సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.