Home /Author anantharao b
కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు.
ఎన్డీఏలో చేరిక అంశం పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఏన్డీఏ నుంచి బయటకు వచ్చామని, ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తాంమని చెప్పారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో 'హరి హర వీర మల్లు' బృందం పవర్‌స్టార్ అభిమానులందరికీ పుట్టినరోజు బహుమతిని ఇచ్చింది. పవన్‌కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
రామ్ చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని, నెలరోజుల క్రితం అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయింది. చరణ్ ప్రాజెక్ట్ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి.
నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. అవి రామ్ చరణ్ - శంకర్ చిత్రం మరియు విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం. దిల్ రాజు ప్రభాస్ కోసం పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాడు. అయితే ప్రభాస్ రాబోయే మూడు సంవత్సరాలు కూడ బిజీగా ఉన్నాడు.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' విడుదలై ఏడాది అవుతున్నా ఇంకా వార్తల్లోనిలుస్తోంది. ఇటీవలే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికపై సందడి చేసింది. ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్ బస్టర్స్' కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది.
సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ట్రోల్ మరియు విమర్శలకు గురవుతున్నాడు. అతని ఇటీవలి చిత్రం లైగర్ ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ సినిమా ఫైనల్ రన్లో భారీ వసూళ్లను రాబడుతుందని పూరీ, విజయ్‌లు అంచనా వేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1న జల్సా సినిమా రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోలు వేస్తున్నారు.
వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 28 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని పేర్కొంది.
దేశమంతటా గణేష్ చతుర్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోవాలోని ఒక కుటుంబానికి చెందిన సభ్యులు కూడ అందరూ ఒక చోట చేరి ఈ పూజను చేసుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పూజకు ఏకంగా 250 మంది కుటుంబ సభ్యలు హాజరయ్యారు. వారు ఉంటున్న భవనం 288 ఏళ్ల నాటిది.