Home /Author anantharao b
బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డు వేలం పాట అన్నా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. బాలాపూర్ లడ్డూ చుట్టు సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ లడ్డును చేజిక్కించుకుంటే నట్టింట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందనే విశ్వాసం ఉన్నాయి.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పాల్వాయి స్రవంతిని పార్టీ ప్రకటించింది. దీనితో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది.
ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) చరిత్రలో తొలిసారిగా 27 మంది చివరి సంవత్సరం లా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్న్‌లో చేరేందుకు అవకాశం దక్కించుకున్నారు. వీరు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటున్న దాదాపు 230 మంది కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మాదిరే రాత్రి పూట కంటైనర్లలో బస చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం తెలిపారు.
నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే పై మరొక వ్యక్తిని బలవంతం చేశాడనే ఆరోపణల పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. ఖాట్మండు పోలీస్ స్టేషన్లో లామిచానేపై ఫిర్యాదు నమోదయింది
సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు.
బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు వేర్వేరు పురుషులతో కవలలకు జన్మనిచ్చి వైద్యులను ఆశ్చర్యపరిచింది. వైద్యులు దీనిని 'మిలియన్లో ఒకటిగా పిలుస్తారు.
ట్విట్టర్ లో తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక ట్విట్టర్ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది.
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.