Home /Author anantharao b
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది,
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వదోదర నగర శివార్లలోని ఒక తయారీ యూనిట్‌పై దాడి చేసి దాదాపు రూ. 500 కోట్ల విలువైన నిషేధిత ఎండి డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ.22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్-3 వాహనాలను, బీఎస్-4 గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారని ఈడీ ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
కర్ణాటకలోని బాగల్కోట్లో ఓ వ్యక్తి కడుపు నుంచి 187 నాణేలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి శనివారం కడుపులో అసౌకర్యం మరియు వాంతులతో బాధపడటంతో బంధువులు హానగల్ శ్రీ కుమారేశ్వర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్టును డిసెంబర్ 1న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ పదవీకాలం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే పరిపాలనలో ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించిన ప్రభుత్వం ఆయన కోసం కొత్త పదవిని సృష్టించింది.
ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. . తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్ జోడో యాత్ర ’ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్ జోడో’గా అభివర్ణించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం మాస్కోకు విమానంలో బయలుదేరాడు. ’పుష్ప ‘ ఇప్పుడు రష్యన్ భాషలోకి డబ్ చేయబడింది. క్రిస్మస్ సీజన్ ప్రారంభానికి ముందు డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.