Home / ఆంధ్రప్రదేశ్
AP Local Body Elections: ఏపీలో ఖాళీగా ఉన్న మూడు ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్ల స్వీకరణకు అనుమతిస్తారు. ఆగస్టు 12వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆగస్టు 14వ […]
AP CM Chandrababu: సింగపూర్ సర్కారుతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండోరోజూ సీఎం సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొని సీఎం మాట్లాడారు. ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్ నుంచి వస్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మన నాయకులు మిళిత, సోషలిస్టు ఆర్థిక విధానాలు అవలంబించారని గుర్తుచేశారు. 1947 సంవత్సరంలోనే ఆర్థిక విధానాల్లో పోటీపడి ఉంటే భారత్ ఇప్పుడు ఎలా ఉండేదో ఒక ఆలోచించాలని కోరారు. 1991లో […]
Minister Kollu Ravindra: మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణానికి పంద్రాగస్టు నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలోనే ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు ఇస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలో పూర్తి కాబోతుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన వల్ల ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖను ఫైనాన్షియల్ హబ్‌గా చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని […]
CM Chandrababu: సీఎం చంద్రబాబు రెండో రోజు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై చర్చించారు. ఆ రికార్డులు సరిచేసేందుకే తాను సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లెంగ్ సీఎం స్పష్టం చేశారు. సింగపూర్‌పై తనకున్న అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో […]
Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో కలిసి పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగానే ఏపీ పారిశ్రామిక విధానాలపై చర్చించనున్నారు. తాజాగా, సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు డయాస్పోరా వలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల […]
Two New Lulu Malls: ఏపీలోని రెండు నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విశాఖ, విజయవాడ నగరాల్లో ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న( ఆదివారం) ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రొడ్డులోని హార్బర్ పార్క్‌లో ‘లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేటు లిమిటెడ్’కు తొంభై తొమ్మిది ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను APIIC ద్వారా కేటాయించింది. ఇందులో 13లక్షల 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా […]
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ తరుణంలో గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 12 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లోని భక్తులకు ఆలయ సిబ్బంది శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు […]
Home Minister Anitha: స్థానిక ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు కెటాయించనున్నట్లు తెలిపారు హోంమంత్రి అనిత. అనకాల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో మాట్లాడిన ఆవిడ యువతకు టీడీపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. టీడీపీకి యువతను ప్రోత్సహించే అలవాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారితోనే మొదలైందని ఆవిడ సెలవిచ్చారు. టీడీపీ పెట్టిన మొదట్లో రాజకీయ అనుభవం లేని వారిని కూడా ఎమ్మెల్యేలను చేసిన ఘనత టీడీపీది. అప్పటి విద్యార్థి యూనియన్ లీడర్లను, […]
Minister Satyakumar Yadav: అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2020 సంవత్సరంలో జరిగిన అక్రమాలకు సంబంధించి 22 మంది డాక్టర్లు, నర్సులపై విచారణ చేపట్టాలని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. 2020లో ఫిబ్రవరిలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో అవినీతి బయటపడింది. కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న మంత్రి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్లపై తప్పుడు లెక్కలు, […]
Chandrababu visit to Singapore: సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని తెలిపారు. పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారన్నారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు […]