Published On:

Kakani Govardhan Reddy: ఒక కేసులో బెయిల్ మరో కేసులో రిమాండ్.. జైల్లోనే కాకాణి.!

Kakani Govardhan Reddy: ఒక కేసులో బెయిల్ మరో కేసులో రిమాండ్.. జైల్లోనే కాకాణి.!

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మరో కేసులో రిమాండ్ విధించింది. మరొక కేసులో ఆయనను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలలో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరు కాగా.. కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన కేసులో నెల్లూరు నాల్గవ అదనపు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించింది.

 

ప్రస్తుతం కాకాణి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈనెల 30 నుంచి 1వ తేదీ వరకు విచారణ జరిపి.. తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించించారు.

ఇవి కూడా చదవండి: