CM Chandrababu: కూటమికి ఏడాది పూర్తి.! ప్రజల్లోకి వెళ్లాలి మన పని: సీఎం చంద్రబాబు

CM Chandrababu: కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి పనినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’పై పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు.
భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జూలై 2వ తేదీ నుంచి ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సమావేశంలో ‘ఇంటి ఇంటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమంతో పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం తప్పులను సరిచేస్తూ పాలన గాడిలో పెట్టామని.. పెట్టుబడులు తీసుకొచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని అన్నారు. సంక్షేమం అందించడంలోనూ ఏమాత్రం తగ్గకుండా పేదలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని తెలిపారు.