Last Updated:

Prabhas: ప్రభాస్‌తో భారీ ఢిల్‌ కుదుర్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ – వరుసగా మూడేళ్లు.. మూడు సినిమాలు..

Prabhas: ప్రభాస్‌తో భారీ ఢిల్‌ కుదుర్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ – వరుసగా మూడేళ్లు.. మూడు సినిమాలు..

Salaar Producer Deal With Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా అంటే నిర్మాతలకు లాభాల పంటే అనడంలో సందేహం లేదు. అతడు ఒకే అంటే చాలు వందల కోట్ల బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రభాస్‌తో సినిమా కోసం నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ రిజల్ట్‌ ఎలా ఉన్నా.. ఆ చిత్రం బాక్సాఫీసు దున్నేయడం పక్కా. ఫ్లాప్‌ మూవీ సైతం వందల కోట్లు రాబడుతుంది. అంతగా ప్రభాస్‌ సినిమాలు ఇండియన్ బాక్సాఫీసును శాసిస్తున్నాయి.

అంతటి మార్కేట్‌ ఉన్న ప్రభాస్‌ను ఓ అగ్ర నిర్మాణ సంస్థ మూడేళ్ల పాటు లాక్‌ చేసుకుంది. ప్రభాస్‌తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సదరు సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. కేజీయఫ్ చాప్టర్‌ వన్‌, కేజీయఫ్‌ చాప్టర్‌ , కాంతార వంటి సినిమాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ భారీ చిత్రాలకు కేరాఫ్‌ అని చెప్పాలి. ఈ సంస్థలో సినిమా అంటే దానికి ఖచ్చితంగా అదోక భారీ ప్రాజెక్ట్‌ అయి ఉంటుంది. అగ్ర హీరోలు, భారీ బడ్జెట్‌ సినిమాలకు కేరాఫ్‌ అయిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు ప్రభాస్‌తో మూడు సినిమాలు చేసేలా ఢిల్‌ కుదుర్చుకుంది.

ఇందుకోసం మూడేళ్ల పాటు ప్రభాస్‌ని లాక్ చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. “భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచేందుకు ప్రభాస్‌తో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ శిఖరాలు చేర్చేందుకు ప్రభాస్‌తో మూడు సినిమాలకు భాగస్వామ్యం పొందామని చెప్పేందుకు గర్వంగా ఉంది. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్‌ అనుభూతిని సృష్టించాలనే మా నిబద్ధతను తెలియజేసేందుకు ఈ ప్రకటన. ఇందుకోసం వేదిక సిద్ధమైంది. ముందుకుసాగే మార్గం అపరిమితంగా ఉంటుంది. ఈ జర్నీ సలార్ 2తో మొదలు కాబోతోంది. అంతా సిద్దంగా ఉండండి” అంటూ హొంబలే ఫిల్మ్స్‌ ప్రకటన ఇచ్చింది.

ప్రభాస్‌ వరుసగా 2026, 2027, 2028 వరకు మూడు సినిమాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. హోంబలే ఫిల్మ్స్‌ జోరు చూస్తుంటే ఇందుకోసం ప్రభాస్‌తో భారీ ఢిల్‌ కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న ప్రభాస్‌ ఈ ఒప్పందం కోసం సుమారు రూ. 450 నుంచి రూ. 500 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ప్రభాస్‌ బ్లాక్‌బస్టర్‌ సలార్‌ 1 చిత్రం హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్లోనే తెరకెక్కింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సలార్‌ ఫస్ట్‌ పార్ట్‌ దాదాపు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. ప్రస్తుతం ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.