ఎండాకాలంలో కీరాదోసను ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా
ఎండాకాలంలో కీరాదోసను ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా health benefits of eating cucumber in summer

కీరదోసకాయ బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా సహాయపడుతుంది.

కీరదోసకాయలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కీరదోసకాయలో 96 శాతం నీరు ఉంటుంది.

దోసకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

దోసకాయ ఫైబర్ కు మంచి మూలం. దీలోని అధిక నీటి శాతం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

కీరదోసకాయలో ఉండే ఫైబర్స్ జీర్ణాశయం గుండా ఆహారం త్వరగా వెళ్లడానికి సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, అసిడిటీ, అల్సర్లు, మలబద్ధకం నివారించడానికి కీరదోసకాయ సమర్థవంతంగా పనిచేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు కీరదోసకాయను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎండాకాలంలో కీరాదోసను ఎక్కువగా తింటారు. నిజానికి వీటిని కాలంతో సంబంధం లేకుండా తినొచ్చు.

ఎండాకాలంలో కీరాదోసను రోజూ తినడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్య ఉండదు
