హార్ట్ స్ట్రోక్ లాగా కంటి స్ట్రోక్.. మరి దీని లక్షణాలేంటో తెలుసా..
హార్ట్ స్ట్రోక్ లాగా కంటి స్ట్రోక్.. మరి దీని లక్షణాలేంటో తెలుసా.. symptoms of eye stroke

హార్ట్ స్ట్రోక్ లాగా కంటి స్ట్రోక్ కూడా వస్తుందని తెలుసా..?

ఐ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ఆప్టిక్ నరాల ముందు భాగంలోని కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల సంభవిస్తుంది

కంటి స్ట్రోక్‌ని రెటీనా ఆర్టరీ అక్లూజన్ అంటారు.

నొప్పి లేకుండానే ఉదయం నిద్రలేవగానే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

దృష్టిలో అస్పష్టత, చీకటి, నీడలు లాంటి ఆకస్మిక మార్పులకు దారితీయ్యడం దీని సంకేతాలు. ఇది తరచుగా ఒక కంటిలో మాత్రమే కనిపిస్తుంది.

కార్డియోవాస్క్యులార్ వ్యాధి ఉన్నవారు ఈ ఐ స్ట్రోక్ బారిన పడే అవకాశాలున్నాయిని డాక్టర్లు చెబుతున్నారు

వయస్సు 50 లేదా అంతకంటే ఎక్కువ, అధిక రక్తపోటు కలిగి ఉండటం, డయాబెటిస్, గ్లాకోమా ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు ఈ ఐ స్ట్రోక్‌కు రిస్క్ జోన్లో ఉన్నారు.

తరచుగా కంటికి మసాజ్ చేయడం ద్వారా కంటిలో రక్తం గడ్డకట్టడాన్ని.. కంటి స్ట్రోక్‌ను నాలుగు గంటలలోపు నిర్ధారణ చేసే వీలుంటుంది.

తగినంత ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తినడం, మీ రక్తంలో చక్కెర, ఒత్తిడి స్థాయిలను చెక్ చేయడం చేయాలి. స్మోకింగ్ మానేయాలి, అధికంగా మద్యం సేవించడం తగ్గించడం వల్ల ఈ స్ట్రోక్ ను నివారించవచ్చు
