Agniveer Scheme: అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ రెడీ.. 31 వారాల కఠిన శిక్షణ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీమ్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఆర్మీ చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్ రెడీ అయింది. హైదరాబాద్ లోని గోల్కొండలోని ఆర్మీ ఆర్టిలరీ
Agniveer Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీమ్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఆర్మీ చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్ రెడీ అయింది. హైదరాబాద్ లోని గోల్కొండలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ లో ఫస్ట్ బ్యాచ్ కు చెందిన 300 మందికి శిక్షణ ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌కు 10 వారాలు ప్రాథమిక ఆర్మీ శిక్షణ, మిగతా 21 వారాలు అడ్వాన్స్ ట్రైనింగ్‌తో కలిపి 31 వారాల కఠిన శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రిగేడియర్ రాజీవ్ చౌహాన్ వెల్లడించారు.
బెస్ట్ క్యాంపస్ గోల్కొండ
అగ్నివీరులకు శిక్షణ ఇవ్వడంలో బెస్ట్ క్యాంపస్ గోల్కొండ అని రాజీవ్ చౌహాన్ తెలిపారు. అగ్నివీర్(Agniveer Scheme) పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలోంచి 25శాతం మందిని శిక్షణకు ఎంపిక చేసినట్టు చెప్పారు. దేశంలోని పలు రీజియన్స్ కు చెందిన 300 మంది అభ్యర్థులు ఈ సెంటర్ కు వచ్చారు. వీరితో పాటు ఫిబ్రవరిలో మరో 2,265 మందికి, ఆ తర్వాత 3,300 మందికి ట్రైనింగ్ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచే 5,500 మంది అగ్నివీర్‌లను సైన్యంలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 30కి పైగా ఫిజికల్ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
శిక్షణలో అత్యాధునిక పరికరాలు
ఇన్‌ఫ్యాట్రీ వెపన్ ట్రైనింగ్ సిమిలేటర్ ల్యాబ్ ద్వారా డిజిటల్ షూటింగ్ చేయిస్తున్నారు. పాయింట్స్ ప్రకారం ట్రైనింగ్‌లో వెయిటేజ్ ఇస్తున్నారు. అత్యాధునిక పరికరాలు, ఫైరింగ్, శారీరక, మానసిక స్థైర్యాన్ని నింపేలా అధికారులు అగ్నివీర్‌లను తీర్చి దిద్దుతున్నారు. అనంతరం శిక్షణపొందిన తొలి బ్యాచ్‌లోని నిష్ణాతులైన పదిమంది అగ్నివీర్‌లను మీడియాకు పరిచయం చేశారు. కాగా, అగ్నివీరులను ఎంపిక చేసేందుకు దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు. రన్నింగ్, పిజికల్ పరీక్షలు, మెడికల్ టెస్ట్ లు ముగిసిన తర్వాత అర్హత పరీక్ష నిర్వహించారు. అన్నింటిలోనూ అర్హత సాధించిన అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేసి ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. దేశంలోని పలు ఆర్మీ కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అసలేంటీ అగ్నివీర్..
భారత సైన్యంలో చేరేందుకు కలలు కంటున్న యువతకు తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం అగ్నిపథ్ పథకం ప్రారంభించింది. 17.5 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న యువతను అగ్నిపథ్ కింద ఏడాదికి 46 వేలమందిని రిక్రూట్ చేసుకుంటుంది. యువతకు నాలుగేళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కల్పించి.. నెలకు 30 నుంచి 40 వేల రూపాయల మధ్య జీతం ఇస్తారు. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని ఇండియన్ ఆర్మీలో కొనసాగించి మిగిలిన వారికి సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు.
అగ్నిపథ్ లో చేరి అగ్ని వీర్ లు సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా వారికి రూ. 48 లక్షల జీవిత బీమా కల్పిస్తుంది కేంద్రం ప్రభుత్వం. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తుంది. అదేవిధంగా సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం 100 శాతం ఉంటే రూ. 44 లక్షలు, 75 శాతమైతే రూ. 25 లక్షలు, 50 శాతమైతే రూ. 15 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు. ఎలాంటి సమస్యలు లేని అగ్ని వీర్ లకు వారి జీతంలో కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్ గా జమ చేస్తారు. నాలుగేళ్ల తర్వాత కార్పస్ ఫండ్ రూ. 5లక్షలకు కేంద్రం మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 11.71 లక్షలు చెల్లిస్తుంది.
ఇవి కూడా చదవండి…
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
Unstoppable Show: అన్ స్టాపబుల్‌లో సందడి చేయనున్న “వీర సింహారెడ్డి” టీం… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vasantha Krishna prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Pathaan Trailer: యాక్షన్.. యాక్షన్.. యాక్షన్.. దుమ్మురేపుతున్న షారూఖ్ ఖాన్ “పఠాన్” ట్రైలర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/