Supreme Court: అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారు.. సుప్రీం కోర్టు
భీమా కోరెగావ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
New Delhi: భీమా కోరెగావ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అవినీతి డబ్బుతో కేసుల నుంచి బయటకు వస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలను చూస్తే అక్కడ జరిగే విషయాలు తెలుస్తాయని, కోట్ల రూపాయల చేతులు మారుతున్నా అవినీతిపరుల పై ఎలాంటి చర్యలు కనిపించట్లేదని మండిపడింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులను కొనుగోలుకు చేసేందుకు కోట్లల్లో బేరం ఆడుతున్న వీడియోలు చూశామని గుర్తు చేసింది. అయినప్పటికీ కళ్లు మూసుకొని ఉన్నామని వ్యాఖ్యానించింది.
ధర్మాసనం వ్యాఖ్యలు పలు రాష్ట్రాల్లోని పార్టీల పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇటీవల పదే పదే కేంద్ర ప్రభుత్వం పై ప్రతి పక్ష పార్టీలు తమ శాసనసభ్యులను కోట్ల రూపాయలతో కొంటున్నారని, తాజాగా తెలంగాణలో 4గురు ఎమ్మెల్యేలను వంద కోట్లు లెక్కన కొనేందుకు ప్రలోభాలు చేశారంటూ కేసులు కూడా నమోదై ఉన్నాయి. అయితే ఈ అంశం పై భాజపా నేతలు ప్రలోభాల కేసును జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ కూడా చేసి వున్నారు.
ఇది కూడా చదవండి: Sanjay Raut: హమ్మయ్య.. ఎట్టకేలకు శివసేన ఉద్ధవ్ పార్టీ నేత సంజయ్ రౌత్ కు బెయిల్