Last Updated:

7 Seater Car In Budget Range: ఈ 7 సీటర్ కారుతో మార్కెట్ గగ్గోలు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్స్..!

7 Seater Car In Budget Range: ఈ 7 సీటర్ కారుతో మార్కెట్ గగ్గోలు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్స్..!

7 Seater Car In Budget Range: భారత్‌లో చిన్న కార్లతో పోలిస్తే పెద్ద కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రజలు ప్రస్తుతం 7 సీటర్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇవి ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించడంతో పాటు లగేజ్ కోసం ఎక్కువ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఈ రోజుల్లో 7 సీటర్ కార్లు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ హోలీకి మీ ఫ్యామిలీ కోసం కొత్త కారును తీసుకోవాలని చూస్తుంటే.. రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు మార్కెట్లో ఉన్న ఈ 7 సీటర్ రెనాల్ట్ ట్రైబర్ కారుపై ఓ లుక్కేద్దాం.

రెనాల్ట్ ట్రైబర్‌లో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది, ఇది మార్కెట్‌లోని ఏ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లో లేనంత పెద్దది. ఈ ఇంజన్ 96 ఎన్ఎమ్ టార్క్, 72 పిఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 18.29 నుండి 19 కిమీల మైలేజీని ఇవ్వగలదు. ఈ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ఎంపికలు ఉన్నాయి.

దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, LED ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, LED DRLతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, సెంట్రల్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్, 182మిమీ హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.

భద్రత గురించి మాట్లాడితే, మీరు ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. గ్లోబల్ NCAPలో ఈ కారు పెద్దలకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్, పిల్లలకు 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ అందించింది. రెనాల్ట్ ట్రైబర్ ధరలు దాదాపు రూ. 6.09 లక్షల నుండి ప్రారంభమవుతాయి. టాప్ మోడల్‌కు దాదాపు రూ. 8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు పెరుగుతాయి. ఈ ధరలో దానికి పోటీగా మార్కెట్లో ఎమ్‌పివి లేదు.