Last Updated:

iPhone 13 Price Drop Alert: బంపర్ ఆఫర్.. ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. డిస్కౌంట్ చూస్తే మతిపోతుంది..!

iPhone 13 Price Drop Alert: బంపర్ ఆఫర్.. ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. డిస్కౌంట్ చూస్తే మతిపోతుంది..!

iPhone 13 Price Drop Alert: మార్కెట్లోకి ఏ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినా ఐఫోన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. స్మార్ట్‌ఫోన్ ప్రియులు యాపిల్ ఫోన్‌లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.  మీరు కూడా iPhone కొనుగోలు చేయాలనుకుంటే ఆపిల్ iPhone 13 తగ్గింపు ధరకు విక్రయిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ లాంచ్ ధరపై రూ. 36,491 తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎమ్ఐ,ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 13 సెప్టెంబర్ 2021లో భారతదేశంలో విడుదల చేశారు. మీరు రూ.40,000 కంటే తక్కువ బడ్జెట్‌లో కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16 ఫోన్‌తో పోలిస్తే, ప్రాసెసర్, కెమెరా సెటప్ పరంగా ఐఫోన్ 13 తక్కువ పనితీరును అందిస్తుంది. బ్యాటరీ పరిమాణం చాలా చిన్నది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్‌లు, ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

iPhone 13 Discount
ప్రస్తుతం, iPhone 13 ఫోన్ అమెజాన్‌లో రూ. 43,499కి విక్రయిస్తుంది. ఇది ఫోన్ 128GB వేరియంట్ ధర. ఫోన్‌ను కంపెనీ రూ.79,990కి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మొబైల్ లాంచ్ ధర నుండి రూ.36,491 కంటే తక్కువకే విక్రయిస్తున్నారు. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను నో కాస్ట్ EMI సౌకర్యం లేకుండా కొనుగోలు చేయచ్చు. అలాగే, Amazon Pay, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై ప్రైమ్ మెంబర్లకు 5శాతం క్యాష్‌బ్యాక్, నాన్ ప్రైమ్ మెంబర్లకు 3శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

iPhone 13 Specifications
ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే సూపర్ రెటినా XDR స్క్రీన్, OLED ప్యానెల్‌తో తయారు చేశారు. ఇది 2532 x 1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌‌కు సపోర్ట్ చేస్తుంది. ట్రూ టోన్, 460 ppi, 800 పీక్ బ్రైట్నెస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ ముందు భాగం సిరామిక్ షీల్డ్‌తో, వెనుక భాగం గాజుతో తయారు చేశారు. ఆపిల్ iPhone 13 మొబైల్ A15 బయోనిక్ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇది 16 కోర్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్. 4 కోర్ GPU, 6 కోర్ CPU ఉన్నాయి. ఈ ఐఫోన్‌లో 128GB స్టోరేజ్ + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.

ఐఫోన్ 13 ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో ట్రూ టోన్ ఫ్లాష్ లైట్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు , వీడియో కాల్‌ల కోసం ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

iPhone 13 స్మార్ట్‌ఫోన్ 3,227mAh కెపాసిటీ బ్యాటరీతో లాంచ్ అయింది. కంపెనీ ప్రకారం.. ఈ ఐఫోన్ 19 గంటల వీడియో ప్లేబ్యాక్,  75 గంటల ఆడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌లో 15W MagSafe వైర్‌లెస్, 7.5W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. మీరు 30 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ చేయచ్చు.