Last Updated:

Maruti Grand Vitara 7-Seater: మారుతి స్కెచ్ మామూలుగా లేదు.. త్వరలో గ్రాండ్ విటారా 7-సీటర్..!

Maruti Grand Vitara 7-Seater: మారుతి స్కెచ్ మామూలుగా లేదు.. త్వరలో గ్రాండ్ విటారా 7-సీటర్..!

Maruti Grand Vitara 7-Seater: దేశంలో 7-సీటర్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మారుతి ఎర్టికా ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందింది. దీని విక్రయాలు కూడా అధికంగా ఉన్నాయి.ఈసారి ఎర్టిగా అమ్మకాల పరంగా Wagon R, Baleno లను కూడా వెనక్కు నెట్టింది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ సెగ్మెంట్ మరింత పెద్దదవుతుందని అంచనా వేస్తున్నారు. మారుతి సుజికి దీన్ని బాగా అర్థం చేసుకుంది. అందుకే కంపెనీ మరో కొత్త 7 సీట్ల కారును తీసుకువస్తోంది. కంపెనీ దాని ప్రసిద్ధ గ్రాండ్ విటారా 7-సీటర్ మోడల్‌పై పని చేస్తోంది. ప్రస్తుతం దీని టెస్టింగ్ జరుగుతోంది. దీని డిజైన్ రాబోయే మొదటి ఎలక్ట్రిక్ కారు eVitara నుండి ప్రేరణ పొందింది.

7-సీటర్ గ్రాండ్ విటారా టెస్టింగ్ జరుగుతోంది. తాజాగా దీని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలలో దాని డిజైన్ చూడొచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఈ కారు టెస్టింగ్ జరుగుతుంది. మారుతి ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో ఇది కొత్త ఎంట్రీ. ప్రస్తుతం కంపెనీ ఎర్టిగా XL6 వంటి 6, 7 సీట్ల MPVలను కలిగి ఉంది.

ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 7 సీట్ల గ్రాండ్ విటారా డిజైన్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చు. దీని ఫ్రంట్, సైడ్, రియర్ లుక్ అప్‌డేట్ అవుతుంది. దాని సి పిల్లర్‌లో అతిపెద్ద మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుండి 3వ స్థానానికి స్థలం ఉంటుంది. మూలం ప్రకారం.. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధారంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి సుజుకి ఇవిటారాను త్వరలో విడుదల చేయచ్చు. కంపెనీ కూడా ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

7 సీట్ల గ్రాండ్ విటారా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ప్రస్తుత 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇందులో, హైబ్రిడ్ ఇంజన్ కారుకు అదనపు బూస్ట్ ఇవ్వడానికి పని చేస్తుంది. కంపెనీ తన ఇంజిన్‌‌లో మార్పులు . దీని వీల్‌బేస్ పెద్దదిగా ఉంటుంది.  దీని కారణంగా 3వ వరుసలో ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటుంది. దీని పొడవు కూడా 4 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ఉండదు. దీని ధర కూడా ఎక్కువగానే ఉండబోతోంది. 10 లక్షలకు పైబడిన సెగ్మెంట్లో మారుతి దీన్ని తీసుకురానుంది. భారతదేశంలో ఇది హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ ప్లస్‌తో నేరుగా పోటీపడుతుంది.

అలానే దీనిలో కంపెనీ ఎక్కువ బూట్ స్పేస్‌ ఉంచడానికి దాని ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. కొత్త 7-సీటర్ గ్రాండ్ విటారా కూడా స్ట్రైట్ టచ్ స్క్రీన్, ADAS సూట్‌ను పొందే అవకాశం ఉంది. ఎర్టిగా SUV కేటగిరీలోకి రానందున, ఇది మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా స్కార్పియో N. MG హెక్టర్ ప్లస్‌లకు ప్రత్యక్ష పోటీని ఇవ్వగలదు.