Home / Ukraine
Trump-Zelenskyy clash in White House: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన మొదటినుంచే ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్.. ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చింది. దీంతో ఉక్రెయిన్.. రష్యా దేశానికి ధీటుగా బదులిచ్చింది. అయితే ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో బైడెన్ ఘోరంగా ఓటమి చెందారు. దీంతో రాజకీయాలు తారుమారైపోయాయి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఉక్రెయిన్‌కు నిధులు ఆపేశారు. రష్యా, ఉక్రెయిన్ […]
Donald Trump slams Zelenskyy about Russia and Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కాస్తా ట్రంప్, జెలెన్ స్కీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఫోకస్ పెట్టారు. రష్యాతో రాజీకి రావాల్సిందేనని జెలెన్స్కీకి ట్రంప్ హుకుం జారీ చేస్తున్నారు. దీనికి జెలెన్ స్కీ ససేమిరా అంటున్నాడు. ఇది కాస్తా ఇరువురి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జెలెన్ స్కీని […]
When Will Ukraine-Russia War End: కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకటి. ఈ శతాబ్దపు సుదీర్ఘ యుద్ధంగా పేరొందిన ఈ పోరు మరో నెల రోజుల్లో మూడో ఏడాదికి చేరనుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేపట్టిన సైనిక చర్య నిరాటంకంగా కొనసాగుతుండటంతో ఉక్రెయిన్ దేశం దాదాపుగా సర్వనాశనమైంది. ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్ తన శక్తిమేర ప్రతిఘటిస్తున్నా.. అది సింహం ముందు చిట్టెలుక పోరులా మిగిలిపోయింది. ఈ పోరు […]
President Biden to provide $725 million weapons aid package for Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుధ్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మొదలైన వార్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థతి కనిపించడం లేదు. అయితే తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు మరిన్ని ఆయుధాలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే మరికొన్ని రోజుల్లో తన పదవీ కాలం ముగింపు దశలో ఉన్నందున పలు […]
రష్యా సరిహద్దులోని బెల్గోరోడ్ అనే నగరంలో ఒక అపార్ట్మెంట్ భవనంలో కొంత భాగం కూలి 13 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. భవనం విధ్వంసానికి ఉక్రెయిన్ బాంబుదాడులే కారణమని రష్యా అధికారులు ఆరోపించారు. ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియోలు, రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలతో బయటపడిన వారి కోసం శిధిలాల గుండా వెతుకుతూవెళుతున్నట్లు చూపిస్తున్నాయి.
రష్యాతో యుద్ధానికి 100,000 మోర్టార్ షెల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేటాయించిన దాదాపు 40 మిలియన్ డాలర్లను పక్కదారిపట్టించడానికి ఉక్రెయిన్ ఆయుధ సంస్థ ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది.
ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరణించారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది కూడా ఉన్నారని రియా నోవోస్టి వార్తా సంస్థ తెలిపింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా 122 క్షిపణులు మరియు 36 డ్రోన్ల తో భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. 22 నెలల యుద్ధంలో శుక్రవారం జరిగినది అతిపెద్ద వైమానిక దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడుల్లో సుమారు కనీసం 20 మంది పౌరులు మరణించారు. ఉక్రెయిన్ వైమానిక దళం 87 క్షిపణులు, 27 డ్రోన్లను అడ్డగించిందని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ వాలెరి జలుజ్నీ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా చేసిన రాకెట్ దాడిలో 49 మంది మరణించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది