Home / tollywood
అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అయోధ్యలో పుట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళం, హిందీభాషల్లో పలు సినిమాల్లో నటించారు.
సమంత ఎంట్రీ మూవీలో చాలా సింపుల్‌గా ఉందని, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ చాలా బాగా నటించినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్లో సమంత మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ "నచ్చింది గాళ్ ఫ్రెండూ". జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించారు.
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం 'నేనెవరు'. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగోలి’’ సినిమాతో బాలనటునిగా నటించిన హమరేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పలువురు ఇండ్రస్ట్రీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం పుష్ప: ది రూల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. సుకుమార్ షూట్ ప్రారంభించాలనుకున్నప్పటికీ, అల్లు అర్జున్ ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని చిత్రీకరణకు వెళ్లాలని చిత్రబృందాన్ని కోరాడు.
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. ఈచిత్రం నవంబర్ 18న విడుదలవుతోంది.
సమంత నటించిన యశోద సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్బుతంగా జరిగింది. థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్‌తో సహా, ఈ చిత్రం వ్యాపారం రూ. 50 కోట్ల మార్కును దాటింది.
‘ఆటగదరా శివ’, ‘మిస్ మ్యాచ్’, ‘క్షణ క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు ఉదయ్ శంకర్. ఆయన నటించిన కొత్త సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక.