Home / Rescue Operation
17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకు వచ్చే సమయం దగ్గర పడిందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సోషల్ మీడియా పోస్ట్‌లో కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది అని ధృవీకరించారు.
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికులందరి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిరంతరం కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 2 కి.మీ మేర ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మనోధైర్యాన్ని ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు.