Home / national news
PAN Card: నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధికశాఖ మంత్రి.. నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలకు.. పాన్ కార్డును సాధారణ గుర్తింపు కార్డుగా పరిగణించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు.
Nirmala Seetharaman:కేంద్ర బడ్జెట్ సందర్భంగా.. పార్లమెంట్ లో కాసేపు నవ్వులు విరబూశాయి. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్ధిక మంత్రి సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. పొరపాటున నోరు జారడంతో.. ఒక్కసారిగా లోక్సభలో నవ్వులు విరిశాయి.
Union Budget 2023-2024: నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
Asaram Bapu: ప్రముఖ.. ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు గుజరాత్ కోర్టు జీవితఖైదు విధించింది. 2013 నాటి అత్యాచార కేసులో దోషిగా తేలడంతో.. గాంధీనగర్ కోర్టు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. కానీ ఇప్పటికే.. మరో రేప్ కేసులో ఆశారం బాపూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు
Mughal Garden: రాష్ట్రపతి భవన్ లో మెుఘల్ గార్డెన్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఇక్కడి అందాలు.. గార్డెన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ఇంతటి చరిత్ర కలిగిన మెుఘల్ గార్డెన్ పేరును కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మార్చింది.
Rahul Priyanka: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. ఈ ముగింపు వేడుకను శ్రీనగర్ లో కాంగ్రెస్ నిర్వహించింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా.. అందుకు పరిస్థితి భిన్నంగా మారింది.
Adani: హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై తొలిసారి గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ 413 పేజీల స్పందనను తెలియజేసింది. హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికించింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. ముఖ్యంగా అదానీ గ్రూపు లక్షల కోట్లు నష్టపోయింది.
Bharat Jodo Yatra End: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించాడు.
Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.