Home / latest Telangana news
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇలా నాలుగు అంశాల్లో చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండాలని తనను కాంగ్రెస్ నేతలు కోరారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేటినుంచి అభ్యర్థులు ఖర్చులను ఎన్నికల కమీషన్ లెక్క గట్టనుంది. అందుకే నోటిఫికేషన్ కు ముందే పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి నెల రోజుల్లోపు ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమైన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. గత వారం రోజులుగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు నిర్వహించిన రామచంద్ర యాదవ్ గురువారం 20 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.
మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.