Home / latest sports news
దేశం వ్యాప్తంగా టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి ఎలుగెత్తి చాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐపీఎల్ టోర్నీలో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో భారత ఆల్ రౌండర్ జడేజా సీఎస్కే నుంచి తొలగించినట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీంలోనే కొనసాగించేందుకు ధోనీ మొగ్గు చూపారు.
టీ20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా పలు టీంలు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన పోరులో ఐర్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్లింది. సెమీస్ రేసులో చేరిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ టీం నిలిచింది.
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 నుంచి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుతో సత్కరించడం మొదలుపెట్టింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నెల గానూ పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. మరి టీమిండియా నుంచి ఈ గుర్తింపును ఏ ఆటగాడు పొందుతున్నాడో ఓ సారి చూసేద్దాం.
క్రికెట్ దేవుడు, భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రోడ్‌సైడ్ చాయ్‌ని ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేశాడు. క్రికెట్ కా గాడ్ తమ చిన్న దుకాణంలో టీ తాగడానికి రావడాన్ని చూసి ఆ టీ దుకాణదారు ఎంతో మురిసిపోయాడు.
ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది. దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది.
ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాల్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటర్లు బరిలోకి దిగారు. ఫస్ట్ హాప్ ముగిసే సరికి భారత్ 184 పరుగులు చేసి బంగ్లాకు185 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది.
భారత క్రికెటర్లు అత్యద్భుత రికార్డులు నెలకొల్పుతు ఉంటారు. ఈ నేపథ్యంలోనే జోరుమీదున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. టీమిండియా యంగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నూతన రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు.
దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ సన్సేషన్ సృష్టించాడు. బ్యాటుతో పెను మైదానంలో పెను విధ్వంసానికి తెరతీశాడు. CSA T20 ఛాలెంజ్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన ఆల్ రౌండర్ డెవాల్డ్ బ్రెవిస్ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు.