Home / latest sports news
క్రికెట్ లోకమంతా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వైపు చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోని గ్రూప్-2లో భాగంగా సెమీస్ కు ఏఏ జట్లు వెళ్తాయి, ఏఏ జట్లు ఇంటి దారి పడతాయనే ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను ఓ సారి పరిశీలించి ఏఏ జట్లు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయో చూద్దాం.
పెర్త్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన అమీతుమీ మ్యాచ్ లో ఎట్టకేలకు సఫారీ జట్టు గెలుపొందింది. టీ20 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న టీమిండియా దూకుడుకు సఫారీ జట్టు బ్రేక్ వేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది.
పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తన జీవితంలోని సంచలన విషయాలను తెలిపాడు. గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని ఓ దశలో కొకైన్ కు బానిసనని వెల్లడించాడు.
టి20 ప్రపంచకప్ 2022లో రెండో శతకం నమోదైంది. మొన్న బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా ప్లేయర్ రైలీ రోసో టీ20 ప్రపంచ కప్ 2022లో మొట్టమొదటి శతకం సాధించాడు. కాగా తాజాగా న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ మరో సెంచరీ కొట్టాడు.
టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు మంచి ఫాం కనపరుస్తోంది. ఇండియా పొట్టి ప్రపంచకప్ లో తన రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ గ్రూప్ 2లోని నెదర్లాండ్స్‌తో జరిగిన పోటీలో 56 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.
సఫారీలు విరుచుకుపడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్ రిలీ రూసో విరోచిత సెంచరీ నమోదు చేశాడు. కేవలం 52 బంతుల్లో రూసో సెంచరీ పూర్తి చేశాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో అద్వితీయ విజయం సాధించిన టీం ఇండియా టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా శుభారంభం చేసింది. కాగా నేడు నెదెర్లాండ్స్ సిడ్నీ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌కు రెడీ అయింది.
టీ20 వరల్డ్ కప్ ప్రయాణంలో టీం ఇండియా విజయారంభం చేసింది. పాకిస్థాన్‌పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫుడ్ సరిగాలేదంటూ టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త నగరం వేదికగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాగా లంకతో జరిగిన మ్యాచ్‌లో, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.