Last Updated:

SBI PO Jobs: డిగ్రీ చదివినవారికి ఎస్బీఐ శుభవార్త… పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా పలు బ్రాంచుల్లోని ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

SBI PO Jobs: డిగ్రీ చదివినవారికి ఎస్బీఐ శుభవార్త… పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SBI PO Jobs: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా పలు బ్రాంచుల్లోని ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్లో రెగ్యులర్ పోస్టులు 1600 ఉండగా, బ్యాక్‌లాగ్ పోస్టులు 73 వరకు ఉన్నాయి. కేటగిరీ వారీగా ఎస్సీ- 270, ఎస్టీ- 131, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్‌- 160, యూఆర్‌ అభ్యర్థులకు- 648 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత: డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ తేదీలు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నేటి నుంచి అక్టోబర్‌ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు: జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం: ఆన్‌లైన్ రాత (ప్రిలిమినరీ/మెయిన్స్‌) పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతం: నెలకు రూ.41,960లు జీతంగా చెల్లిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌  మరియు అప్లికేషన్ ఫీజుకు చివరి తేదీ: అక్టోబర్‌ 12, 2022.

ప్రిలిమినరీ పరీక్షలకు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్: డిసెంబర్ మొదటి/ రెండో వారం, 2022.
ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: డిసెంబర్ 17,18,19,20.
ఇతర పూర్తి వివరాలకు ఎస్భీఐ అధికారిక వెబ్ సైట్ను సంప్రదించగలరు.

ఇదీ చదవండి: SSC CGL Jobs: డిగ్రీ విద్యార్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు… ఎస్ఎస్సీ అభ్యర్థులకు గెట్ రెడీ

ఇవి కూడా చదవండి: