Lava Blaze Pro: లావా బ్లేజ్ ప్రో వచ్చేసింది… ఫీచర్లివే..!
తక్కువ ధరకే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకునే వారికి భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత సరమైన ధరకే లావా బ్లేజ్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దామా...
Lava Blaze Pro: తక్కువ ధరకే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకునే వారికి భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత సరమైన ధరకే లావా బ్లేజ్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దామా…
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన లావా బ్లేజ్ ప్రో లాంచ్ అయింది. 4జీ కనెక్టివిటీతో లావా ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. లావా బ్లేజ్ ప్రోలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర తెలియరాలేదు. కాగా కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కాగా వీటిని ఎప్పటి నుంచి అమ్మకానికి పెడతారు అనేది తెలియదు.
లావా బ్లేజ్ ప్రో ఒక డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్ ఫోన్. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ చరవాణి పనిచేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ ఐపీఎస్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను లావా సంస్థ ఈ ఫోన్లో అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలను అమర్చారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మాక్రో, పొర్‌ట్రెయిట్ సెన్సార్లు కూడా ఈ ఫోన్లో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.0, వైఫై, ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ సపోర్ట్ ఈ ఫోన్లో పొందుపరిచారు. మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇవండీ తక్కువ ధరకే మన భారతీయ కంపెంనీ వినియోగదారుల ముందుంచనున్న స్మార్ట్ వివరాలు. ఇంకెందుకు ఆలస్యం మార్కెట్లోకి వచ్చినవెంటనే కొనెయ్యండి మరీ.
ఇదీ చదవండి: HONDA Electrical Scooters: యాక్టివా కంటే తక్కువ ధరకే హోండా ఎలక్ట్రికల్ స్కూటర్..!