Home / latest national news
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
Oommen Chandy: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ ఇకలేరు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు.
వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 26 పార్టీలు నగరంలో తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో సమావేశం అయ్యారు.
రేపు జరగబోయే ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రైమ్9తో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తోపాటుగా ఎన్డి పాలసీలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నదానిపై చర్చించే అవకాశాలున్నాయన్నారు. ఏపీ ఎన్నికలపై కూడా ఎన్‌డిఎ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారు.
భారీ వర్షాల నేపధ్యంలో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భీమ్‌గోడ బ్యారేజీ యొక్క ఒక గేటు దెబ్బతింది. దీనితో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.హర్ కి పౌరి ఘాట్ సమీపంలోని భీమ్‌గోడ బ్యారేజీ యొక్క స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో హరిద్వార్‌లోని గంగలో నీటి మట్టం ఆదివారం హెచ్చరిక స్థాయి 293 మీటర్లకు చేరుకుంది. అధికారులు హై అలర్ట్ జారీ చేసి, దిగువన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. పొన్ముడి తనయుడు, లోక్‌సభ ఎంపీ గౌతం సిగమణిపై కూడా సోదాలు జరుగుతున్నాయి
Vande Bharat: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వందేభారత్ దేశమంతటా పలు పట్టణాల్లో పరుగులు పెడుతోంది. అయితే పలు కారణాల వల్ల ఇటీవలె కాలంలో జరిగిన వందేభారత్ రైలు ప్రమాదాలను చూశాం. కాగా ఈ సారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటల చెలరేగాయి.
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు రిటైల్ మార్కెట్లలోని ఇతర ప్రదేశాలలో తక్షణమే అమలులోకి వచ్చేటటువంటి రాయితీతో కూడిన టమోటాల ధరను కిలోకు రూ.90 నుండి రూ.80కి తగ్గించింది. దేశంలోని 500 పైగా ప్రదేశాల్లో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత టమోటాల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం మరియు ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులలో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు మరియు స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. దీనితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాజౌరీకి చెందిన మహిళ, పెళ్లి సాకుతో 20 మందికి పైగా పురుషులను మోసం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. 20 మంది పురుషులు తమ భార్యలు తప్పిపోయారంటూ కంప్లైంట్ ఇవ్వడానికి కాశ్మీర్ పోలీసులను సంప్రదించారు. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. వీరు సబ్మిట్ చేసిన ఫోటోలన్నింటిలో ఉన్నది ఒకే మహిళ కావడం విశేషం.