Home / Kakinada
ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.
కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. 5,6 తరగతి గదుల్లో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ జిల్లా వాకలపూడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆగష్టు 12వ తేదీన ఇదే పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది.