Home / Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు భూమి పూజ చేశారు.
మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ పనులకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
త్యం ఉరుకుల పరుగుల జీవితం సాగించే హైదరాబాద్ ప్రజలు చాలా మంది మెట్రోపై ఆధారిపై ఉంటారు. తక్కువ ధరకు అతితక్కువ సమయంలో ట్రాఫిక్ ఆటంకం లేకుండా చాలా మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే తాజాగా ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది మెట్రో యాజమాన్యం. త్వరలోనే మెట్రోరైలు చార్జీలను పెంచనుంది.
మెట్రో రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇప్పటివరకు ఉన్న రైళ్ల రాకపోకల వేళలను మరింత పెంచింది. రాత్రి 10.15 గంటల వరకు ఉన్న రైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. పొడిగించిన వేళలు సోమవారం 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనింది.
హైదరబాదు మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా 4లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించిన్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాదీలను మెట్రో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చనుకుంటే, ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మెట్రోను తీసుకొస్తే, అదే మెట్రో ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది.