Home / BJP
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండాలని ఆ పార్టీ నేతలు నిర్దేశించారు. ఇందులో భాగంగా పల్లె గోస- బీజేపీ భరోసా పేరుతో నేటి నుంచి బైక్ ర్యాలీ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా, మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందన్నారు.
గోవా కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిపోయింది. 40 మంది గోవా శాసనసభ్యుల్లో కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు 11 మంది. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మిగలగా, ఆరు మంది బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతుండం పట్ల కాంగ్రెస్ అధిష్టానం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.