Home / BJP
తాను బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఎత్తేస్తామని బీజేపీ నుంచి తనకు సందేశం వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే బీజేపీలో చేరడం కంటే తన తల నరుక్కుంటానని ఆయన అన్నారు.
బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని మాజీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి విస్తరణకు ఉపయోగపడుతుందనే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్నాని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు.
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 30 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.
మునుగోడు ప్రజా దీవెన సభా వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రావడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేళ్లైనా క్రిష్ణా జలాల్లో వాటాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.
మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి.
లేడీ అమితాబ్ విజయ శాంతి పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా, ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ సోదరిగా పిలిపించుకున్నా, అక్కడా కుదురుకోలేకపోయారు.
బావమరిది మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే సమావేశాలు సాధారణమేకదా. అలాగే అతను కూడ ఈ సమావేశం నిర్వహించాడు. అయితే ఈ సమావేశానికి అతని బావ హాజరయ్యాడు. ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయిన అతడికి ఎటువంటి అధికారిక పదవి లేదు.
బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పై తాను అసంతృప్తిగా ఉన్నట్టు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. జాతీయ నాయకత్వంతో తనకు ఎలాంటి సమస్య లేదని,