Home / క్రీడలు
రేపటి నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. అయితే వన్డే సిరీస్ కు ముందు భారత్ ను గాయాల బెడద వెంటాడుతుంది. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు.
థర్డ్ పార్టీల నుండి మితిమీరిన ప్రభావం" కారణంగా భారతదేశాన్ని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి (ఫిఫా)మంగళవారం సస్పెండ్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును దేశం నుండి తొలగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్‌హామ్‌లో మెడల్స్ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు.
విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో టీ20లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో 600వ వికెట్ తీసి, ఈ ఘనతను అందుకున్నాడు.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టునుంచి బయటకు వచ్చి గోవా జట్టలో చేరాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ గత ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున రెండు T20లు ఆడాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు విడిచారు. రూడీ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే.
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని సింధు ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది.
బ్రిటన్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.