Home / క్రీడలు
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్లో ఆడే క్రెకటర్లు కోటీశ్వరులని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఆటతో అనుబంధం ఉన్న వారు కూడా బాగానే సొమ్ములు వెనకేసుకుంటారు. తాజాగా మాజీ క్రికెట్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్‌కు స్కై స్పోర్ట్స్ నుంచి క్రికెట్‌కు సంబంధించి కామెంటరీ చేయాలని ఆఫర్ వచ్చింది. దీనికి సెహ్వాగ్ రోజుకు తనకు 10వేల బ్రిటిష్ పౌండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఐపీఎల్ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం టీమ్ ఇండియా (సీనియర్ పురుషులు) కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో రాహుల్ ద్రావిడ్ భారత ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మరియు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో సహా సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యుల ఒప్పందాలను కూడా బిసిసిఐ పొడిగించింది.
: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన దైన సింప్లిసిటీతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. విషయానికి వస్తే ఓ అభిమాని తన మోటార్ బైక్ పై ధోని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీనితో ధోని తన అభిమాని ట్రయంఫ్ రాకెట్ 3R మోటార్సైకిల్నుముందు తన స్వంత టీ-షర్ట్‌తో శుభ్రం చేసి సంతకం పెట్టాడు.
భారత పేస్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి అస్థానాను వివాహం చేసుకున్నాడు. అతని వివాహ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్వాతిని సైనీ పెళ్లి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ
ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.
వన్డే ప్రపంచకప్ లో వరుసగా ఆరు మ్యాచులను గెలిచిన ఇండియా ఏడవ మ్యాచులో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత పేసర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక బ్యాట్స్ మెన్ ఒకరి తరువాత మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీనితో శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయి ఘోరపరాజయాన్ని పొందింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
దిగ్గజ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967 మరియు 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. బేడీ, ఎరపల్లి ప్రసన్న,చంద్రశేఖర్ మరియు వెంకటరాఘవన్లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో కీలకమైన ఆటగాడిగా నిలిచారు.