Home / క్రీడలు
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.
లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు.
పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన చేసింది.శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 5-1తో జపాన్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
క్రికెటర్ శిఖర్ ధావన్‌ను విడిచిపెట్టిన భార్య ఏషా ధావన్ క్రూరత్వం ప్రదర్శించిందనే కారణంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం అతనికి విడాకులు మంజూరు చేసింది. ధావన్ మరియు ఏషా ముఖర్జీ 2012లో వివాహం చేసుకున్నారు.
హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు.
: 41 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది.సుదీప్తి హజెలా (చిన్స్కీ - గుర్రం పేరు), హృదయ్ విపుల్ ఛేడా (కెమ్‌క్స్‌ప్రో ఎమరాల్డ్), అనుష్ అగర్వాలా (ఎట్రో), మరియు దివ్యకృతి సింగ్ (అడ్రినాలిన్ ఫిర్‌ఫోడ్)లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. ఈ రోజు ఉదయం షూటింగ్ విభాగంలో భారత్ కు మొదటి బంగారు పతకం వచ్చింది. దీనితో ఆసియాక్రీడల్లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 9 కు చేరింది.
ఆసియా క్రీడల్లో భారతదేశపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది.భారత షూటర్లు దివ్యాన్ష్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మరియు రుద్రంక్ష్ పాటిల్ ఆభారత్కు తొలి బంగారు పతకాన్ని అందించారు.
ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.
ఆసియా కప్ 2023 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తక్కువే స్కోర్ కే పరిమితం అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంకను చిత్తుచేసి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది.