Virender Sehwag: క్రికెట్ కామెంటరీ చెప్పడానికి రోజుకు 10 లక్షలు అడిగిన వీరేంద్ర సెహ్వాగ్‌

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఐపీఎల్‌లో ఆడే క్రెకటర్లు కోటీశ్వరులని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఆటతో అనుబంధం ఉన్న వారు కూడా బాగానే సొమ్ములు వెనకేసుకుంటారు. తాజాగా మాజీ క్రికెట్‌ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు స్కై స్పోర్ట్స్‌ నుంచి క్రికెట్‌కు సంబంధించి కామెంటరీ చేయాలని ఆఫర్‌ వచ్చింది. దీనికి సెహ్వాగ్‌ రోజుకు తనకు 10వేల బ్రిటిష్‌ పౌండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 02:57 PM IST

Virender Sehwag: మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఐపీఎల్‌లో ఆడే క్రెికటర్లు కోటీశ్వరులని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఆటతో అనుబంధం ఉన్న వారు కూడా బాగానే సొమ్ములు వెనకేసుకుంటారు. తాజాగా మాజీ క్రికెట్‌ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు స్కై స్పోర్ట్స్‌ నుంచి క్రికెట్‌కు సంబంధించి కామెంటరీ చేయాలని ఆఫర్‌ వచ్చింది. దీనికి సెహ్వాగ్‌ రోజుకు తనకు 10వేల బ్రిటిష్‌ పౌండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

అంత ఇవ్వలేం..(Virender Sehwag)

వీరేంద్ర సెహ్వాగ్‌ ఇంగ్లీష్‌ బ్రాడ్‌కాస్టర్‌లతో జరిగిన చర్చల అంశాల గురించి ఆస్ట్రేలియా క్రికెట్‌ గ్రేట్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో పంచుకున్నాడు. ఫేమస్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్కై స్పోర్ట్స్‌ తనను ప్యానెల్‌లో చేరాలని ఒత్తిడి తేవడం.. దానికి తాను ప్యానెల్‌ చేరాటంటే తన ఫీజును మీరు భరించజాలరని సెహ్వాగ్‌ చెప్పాడు. దానికి స్కై స్పోర్ట్‌ వారు.. మీ ధర ఎంతో చెప్పండి అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దానికి సెహ్వాగ్‌ తన ఫీజును మీరు భరింలేరు అని చెప్పడం… దయ చేసి మీ ఫీజు ఎంత అని చెప్పండి అని బ్రాడ్‌కాస్టర్‌ బతిమాలడం జరిగిపోయాయి. చివరకు సెహ్వాగ్‌ సరే తన ఫీజుకు రోజుకు 10వేల బ్రిటిష్‌ పౌండ్లు అని చెప్పేశాడు. దీంతో కంగుతినడం బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టర్‌ వంతైంది. 10వేల బ్రిటిష్‌ పౌండ్లు అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం పది లక్షల రూపాయలుగా చెప్పుకోవచ్చు. కామెంటెరీ చెప్పే వారికి పది లక్షల రూపాయలా అని కంగుతిన్న బ్రాడ్‌కాస్టర్‌ మీ ధర మీకు సరైంది. కానీ.. మేము అంత చెల్లించలేమని పరోక్షంగా తేల్చి చెప్పారు.

భారత క్రికెటర్లు సంపన్నులు..

ఇదే సెహ్వాగ్‌ గతంలో తనకు బీబీఎల్‌ ఫ్రాంచైసీ నుంచి లక్ష డాలర్ల ఆఫర్‌ వస్తే తానే తిరస్కరించానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో మాట్లాడుతూ.. ఇండియాన్‌ ప్లేయర్స్‌ ఎప్పుడైనా బిగ్‌ బ్రిటిష్‌ లీగ్‌లో ఆడారా అని ప్రశ్నిస్తే.. దానికి సెహ్వాగ్‌ సమాధానమిస్తూ.. భారతీయ క్రికెటర్లకు బీబీఎల్‌లో ఆడాల్సిన కర్మ పట్టలేదు. ఎందుకంటే వారివద్ద బోలెడంత డబ్బు ఉందని వివరించారు. దీనికి గిల్‌క్రిస్ట్‌ … అయితే ఇండియన్‌ ప్లేయర్స్‌ ఇతర టి 20 లీగ్స్‌కు వెళ్లరా అని ప్రశ్నించారు. దీనికి సెహ్వాగ్‌ సమాధానం ఇస్తూ.. ఆ అవసరమే రాదు. భారతీయ క్రికెటర్లు సంపన్నులు. పేద దేశాల్లో ఆడేందుకు వెళ్లరని నిర్మోమమాటంగా చెప్పారు. ఈ సందర్బంగా సెహ్వాగ్‌ తాను బీబీఎల్‌ కాంట్రాక్టును తిరస్కరించిన విషయాన్ని ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు వివరించాడు. తాము ఇతర దేశాలకు వెళ్లి క్రికెట్‌ ఆడాల్సిన కర్మపట్ట లేదు. ఎందుకంటే తాము సంపన్నులం. పేద దేశాలకు చిన్న చిన్నలీగ్‌లలో ఆడ్డానికి వెళ్లమని స్పష్టం చేశాడు. తాను ఐపీఎల్‌ ఆడుతున్నప్పుడు తనను ఇండియన్‌ టీం నుంచి తప్పించిన విషయం తనకు ఇప్పటికి గుర్తుందన్నారు. అటు తర్వాత తనకు బీబీఎల్‌ నుంచి ఆఫర్‌ వచ్చింది. దానికి తాను సరేనని అన్నాను. ఎంత డబ్బు ఇస్తారు అని అడిగితే లక్ష డాలర్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. దానికి తాను సమాధానం ఇస్తూ.. ఈ లక్ష డాలర్లు.. తాను తన హాలీడేలో ఖర్చు చేస్తానని చెప్పానని తెలిపాడు.