On This Day Rohit Sharma Hits 264 Runs: రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే అతడి బ్యాటింగ్ గురించే చెప్పుకుంటారు. గ్రౌండ్‌లోకి దిగాడంటే సిక్స్, ఫోర్లుతో విజృంభిస్తాడు. అతడి బ్యాటింగ్ అంటే వరల్డ్ చాంపియన్స్ కంగారులకు సైతం హడలే. అలా క్రికెట్‌లో ‘హిట్‌మ్యాన్’గా అరుదైన బిరుదును పొందాడు. అంతేకాదు తన పేరిట ఎన్నో రికార్టులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా వన్డే చరిత్రంలో సెంచరిలో బాది హిట్‌మ్యాన్‌గా నిలిచాడు. అంతేకాదు డబుల్ సెంచరి చేసి క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌నే రికార్డునే అధిగమించాడు.
సాధారణంగా ఓ ఆటగాడి పేరుపై ఉన్న రికార్డును మరో ఆటగాడు అధిగమిస్తూనే ఉంటారు. అయితే రోహిత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. అదే అతడి వ్యక్తిగత స్కోర్. ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయడం ఏ ఆటగాడి వళ్ల కాలేదు. చార్లెస్ కోవెంట్రీ, సయీద్ అన్వర్ 194 రన్స్ వద్దే ఆగిపోయారు. అయితే 2010లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసి నయా రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన తర్వాత 2011లో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరి కొట్టాడు. వీరి తర్వాత ఆ అరుదైన రికార్డు సాధించింది రోహిత్ శర్మనే.
2013లో ఆస్ట్రేలియాపై రోహిత్ మొదటి ద్విశతకం (209) చేశాడు. ఆ వెంటనే శ్రీలంతో మ్యాచ్‌లో మరో డబుల్ సెంచరీ కొట్టి అరుదైన ఘనత సాధించాడు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు 2014లో భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్‌తో దూసుకుపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. అప్పటి వరకు సచిన్ టెండూల్కర్‌పై ఉన్న అత్యథిక వ్యక్తిగత స్కోర్ రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమింఇయా 5-0 తేడాతో విజయం సాధించింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన నాలుగో సిరీస్‌లో రోహిత్ తన బ్యాటింగ్‌తో విశ్వరూపం చూపించాడు. సిక్స్, ఫోర్లలతో విజృంభించాడు. ఈ సిరీస్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ చివరి వరకు బరిలో నిలిచాడు. ఒపెనర్‌గా అజింక్య రహానె, అంబటి రాయుడు త్వరగా ఔట్ అయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 202 పరుగలు భాగస్వాయం చేశారు. అప్పటికే రోహిత్ సెంచరీ చేశాడు. కోహ్లి తర్వాత సురేష్ రైనా రాగా అతడు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. అప్పటికే సెంచరి సాధించిన రోహిత్.. రాబిన్ ఉతప్పతో ఐదో వికెట్ వద్ద 128 పరుగులు చేశాడు.
ఇక వీరిద్దరు కాంబినేషన్‌లో రోహిత్ డబుల్ సెంచరీ చేశాడు. ఫైనల్ 264 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు అందుకున్న రోహిత్‌కు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రూ. 2,64,000 లక్షల చెక్ అందించింది. అయితే ఇప్పటివరకు ఈ రికార్డును ఏ ఆటగాడు అధిగమించలేదు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ గప్తిల్(2015) 234 పరుగులు చేసినా.. రోహిత్ రికార్డు మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఇప్పటికీ ఈ రికార్డు ఈ ‘హిట్‌మ్యాన్’ ఖాతాలో చెక్కుచెదరకుండ ఉండటం విశేషం.