Site icon Prime9

Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్‌ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్‌ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా… మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

అలాంటి విషయాలు పట్టించుకోను..(Virat Kohli)

తానెప్పుడూ ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది అనుకుంటూ తన కెరీర్‌ను ముగించదల్చుకోలేదని విరాట్ కోహ్లి అన్నారు. అసలు అలాంటి విషయాలను పట్టించుకోనన్నారు. తాను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండనని వివరించారు. అక్కడితో వదిలేసి తదుపరి మనం చేయగలిగే వాటిపైనే ఆలోచిస్తానని స్పష్టం చేశారు.ఎప్పుడైనా సరే మ్యాచ్‌ ఆడిన తర్వాత.. ఎందుకు అలా ఆడానా అని పశ్చాత్తాపపడకూడదని తెలిపారు. ఇక క్రికెట్‌కు తాను వీడ్కోలు పలికిన తర్వాత చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించనని తెలిపారు.

Exit mobile version