BGT: భారత్‌-ఏతో టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌, బీసీసీఐ అనూహ్య నిర్ణయం – ఆడియన్స్‌కి షాక్..

  • Written By:
  • Updated On - November 13, 2024 / 03:28 PM IST

BCCI schedules practice match for Indian team: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఘోరపరాభవం చెందిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనం భారతీయులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్‌ల్లో స్టార్‌ ప్లేయర్స్‌ రాణించకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వస్తుండటంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది.

ఈ క్రమంలో త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫి విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా విఫలమైన తీరు చూసి ఆటగాళ్లకు ఎక్కువ ప్రాక్టిస్‌ అవసరమని సీనియర్స్‌ బోర్డుకు సూచించారట. ఈ నేపథ్యంలో బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫి వార్మమ్‌ మ్యాచ్‌ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండి(BCCI) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. సిరీస్‌కు ముందు భారత్‌-ఏతో టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌ను బీసీసీఐ ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ చేసింది.

కానీ, టెస్ట్‌ సిరీస్‌ పరాభవం తర్వాత అనూహ్యంగా బోర్డు ఆ మ్యాచ్‌ను రద్దు చేసింది. దీంతో బీసీసీఐపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమ నిర్ణయాన్ని దిద్దుకుంటూ భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్‌ మూడు రోజుల ప్రాక్లీస్‌ మ్యాచ్‌ని షెడ్యూల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ ఎవరూ చూడకుండా నిర్వహించాలని బోర్డు అనుకుంటుందట. సిరీస్ ప్రారంభానికి ముందు అన్ని విషయాలను గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ద‌క్షిణ పెర్త్‌లోని డ‌బ్ల్యూఏసీఏ(WACA)గ్రౌండ్‌లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఇంట్రా-స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

కాగా, 5 మ్యాచ్‌ల బీజీటీ(BGT) సిరీస్‌ నవంబర్‌ 22 నుంచి పెర్త్ వేదిక‌పై మొద‌టి టెస్టుతో ప్రారంభం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీలో కివీస్‌తో స్వదేశంలో విఫలమైన రోహిత్‌ సేన ఈ ఐదు సీరిస్‌ల బీజీటీలో నాలుగు గెలవాల్సి ఉంది. అలా జరగాలి అంటే ఆసీస్‌ గడ్డపై రోహిత్‌, కోహ్లి మెరుగ్లా ఆడాలి. అప్పుడే డబ్ల్యూటీసీలో ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. కాగా ఈ టోర్ని కోసం ఇప్పటికే కోహ్లితో పాటు రిషబ్‌ పంత్‌, యశస్వీ జైస్వాల్‌, జస్‌ప్రిత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. అయితే రోహిత్‌ రెండో టెస్ట్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.