T20 World Cup 2024 Winners: గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, టీమ్ ఇండియా విమానం రన్‌వేపై అగ్నిమాపక దళం నుండి గ్రాండ్ వాటర్ సెల్యూట్ అందుకుంది.
పోటెత్తిన అభిమానులు..(T20 World Cup 2024 Winners)
క్రికెటర్ల రాకతో ముంబయి విమానాశ్రయం, వాంఖడే స్టేడియం మరియు మెరైన్ డ్రైవ్ ప్రాంతాలు అభిమానులతో జనసంద్రంగా మారాయి. బీసీసీఐ మెరైన్ డ్రైవ్ నుండి జట్టు కోసం విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించింది. ఇది పూర్తయిన తరువాత వాంఖడే స్టేడియంలో స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అనంతరం ప్రపంచ కప్ హీరోలను సత్కరిస్తారు.జూన్ 29న కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భాతర జట్టు దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి 11 ఏళ్ల తరువాత టి 20 ప్రపంచ కప్ ను సాధించింది.