Home / క్రికెట్
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. కాగా ఈసర్వ విశేషం ఏంటంటే వరల్డ్ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే హైదరాబాద్ వేదికగా భారత్‌కు ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా జట్టు అవతరించింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేక ఓటమి పాలయింది. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో భారత్ తడబడింది.
క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ శుభవార్త చెప్పింది. త్వరలో జరగబోయే ఆసియా కప్, ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది. అయితే, మొబైల్ లో చూసే వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్టున్నట్టు తెలిపింది.
ఆస్ట్రేలియాతో జరుగతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 327/3 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మొదటి సెషన్ ముగిసే సమయానికి 422/7 తో కట్టడి చేయగలిగారు.
WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో గద పట్టేదెవరు? అదేంటీ విజేత ఎవరో తేలడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కదా. అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఆశ్రయించారు. మరి ఏఐ చెప్పిన సమాధానమేంటో ఆసీస్ ప్లేయర్లు వీడియో ద్వారా పంచుకున్నారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ఎవరనేది మేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడిగాం. ఏఐ ఇచ్చిన ఆన్సర్ చాలా […]
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. తొలి రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా..
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా టాస్ నెగ్గిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్ మొదలు కానుంది. లండన్‌లోని ప్రసిద్ద ‘ఓవల్’మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన సన్నద్ధమవుతోంది.
ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది.