8th Pay Commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం పోస్టుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు!

8th Pay Commission Terms of Reference: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 8వ వేతన కమిషన్ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన కమిషన్ నిబంధనలు, అధికారిక నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొత్త వేతన ప్యానెల్‌కు సంబంధించి ప్రధానమైన అధికారులను ప్రభుత్వం నియమించలేదు. దీంతో తాజాగా, 8వ కేంద్ర వేతన కమిషన్‌లో నాలుగు అండర్ కార్యదర్శులకు సంబంధించి పోస్టులకు సిబ్బంది, ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులకు గానూ దరఖాస్తులను ఇచ్చేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించింది.
ఈ మేరకు పోస్టులకు సంబంధించి దరఖాస్తుల గడువును 2025, జూలై 31వరకు పొడిగించింది. అయితే డీఓపీటీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి దరఖాస్తులను పొడిగించడం మూడోసారి కావడం విశేషం. తొలుత 2025 ఏప్రిల్‌లో డీఓపీటీ వ్యయ విభాగంలోని సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ ప్రకారం.. 8వ వేతన కమిషన్ పరిధిలో 4 అండర్ సెక్రటరీ పోస్టులను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22వ తేదీన పోస్టులకు సంబంధించి దరఖాస్తులు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందలేదు. దీంతో కేంద్ర వేతన కమిషన్ పొడిగిస్తూ వస్తుంది.
కాగా, ఈ పోస్టులకు దరఖాస్తులు ఇచ్చేందుకు మే 21వ తేదీని చివరి గడువుగా విధించారు. ఆ తర్వాత జూన్ 10 వరకు పొడిగించారు. ఇటీవల జూన్ 12న తేదీ ముగిస్తుండగా.. రెండో సారి జూన్ 30 వరకు పొడిగించారు. తాజాగా, మూడోసారి జూలై 31 వరకు పొడిగించారు.