Prince Movie Review: జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ప్రిన్స్. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. దీనితో సినిమా టాక్ బయటకు వచ్చింది. కొందరేమో ఈ సినిమా యావరేజ్ అని, ఇంకొందరేమో సూపర్ అని, మరి కొందరైతే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని, తెగ నవ్వించేశారని అంటున్నారు. మొత్తానికి ప్రిన్స్ మూవీకి ఇలా మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.
#PRINCE – SUPRISE IN CLIMAX❤️🔥❤️🔥❤️🔥
— nxdhz (@Thalapathi_nidh) October 21, 2022
కాగా ఈ సినిమాకు సంబంధించి కొందరు సినీ లవర్స్ ట్విట్టర్ ద్వా రా రివ్యూ ఇచ్చారు. కొందరేమో ఈ సినిమా మిస్టర్ లోకల్ 2లా ఉందంటూ కామెంట్లు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు హాలీవుడ్‌కు క్రిఫ్ ఈవన్స్, కోలీవుడ్‌కు శివ కార్తికేయన్ వారి సక్సెస్ ఓర్చుకోలేని వాల్లే ఈ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారంటూ నెటిజన్లు అంటున్నారు. ఇకపోతే దళపతి విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు పాట రిఫరెన్స్ ఈ చిత్రంలో ఉందని కొందరి మాట.
Hollywood lo Chris Evans
Kollywood SivaKartikeyanNegativity because of their Growth and success ❤️
Full happy for you @Siva_Kartikeyan #BlockBusterPrince #Prince
— 🥶. (@KuskithalaV6) October 21, 2022
Prince : First half humour works better than the second half. Thaman scores well and moves the movie. SK-Maria pair is cute. Premji in an extensive role. Watchable film and the working of humour is very subjective in this film’s case. Sathyaraj Sir does well. #Prince #SK
— Mahathevan S J (@SJMahathevan) October 21, 2022
దళపతి విజయ్ సీన్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో పూనకాలే అంటూ చెబుతున్నారు. అంటే ఈ సినిమాలో శివకార్తికేయన్ తో పాటు గెస్ట్ అప్పీయర్సెన్లో దళపతి విజయ్ కూడా ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు స్టోరీ సరిగ్గా లేదని, కామెడీ దాదాపుగా వర్కౌట్ అయిందని కొందరి అభిప్రాయం. సత్యరాజ్ అదరగొట్టేశాడని, బీజీఎం, సాంగ్స్ అదిరిపోయాయ్ అని, ప్రథమార్థం బోర్ కొట్టించినా, సెకండాఫ్ నవ్వించేశారని అంటున్నారు. మొత్తంగా సున్నితంగా సాగిపోయే ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.
ఇదీ చూడండి: “ప్రిన్స్” హీరోయిన్ “మరియా” గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!