Hero Raj Tarun: ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. కాగా ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.
అబార్షన్ చేయించాడు..(Hero Raj Tarun)
ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో లావణ్య మాట్లాడుతూ… రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని .. 2014లో తాము పెళ్లి చేసుకున్నారని చెప్పారు. రాజ్ తరుణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 70 లక్షల రూపాయల వరకు ఇచ్చి ,తమ కుటుంబం ఆదుకుందని తెలిపారు. అంతేకాదు 2016లో ఆమె గర్భం దాల్చినట్లు … రాజ్ తరుణ్ ఆమెకు అబార్షన్ చేయించినట్లు చెప్పారు.
ఇక లావణ్యను రాజ్ తరుణ్, మాల్వీ కలిసి డ్రగ్స్ కేసులో ఇరికించారని .. జనవరిలో లావణ్య యూఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియచేసారు. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని… తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్లు ఆమె తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రశ్నిస్తే… చంపేస్తామని రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ బెదిరించారని లావణ్య వెల్లడించారు.