Site icon Prime9

Amaran OTT:వాయిదా పడ్డ అమరన్‌ ఓటీటీ రిలీజ్‌? – కారణమేంటంటే..!

Amaran OTT Release Postponed: శివకార్తికేయన్‌, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘అమరన్‌’. దీపావళి కానుగా అక్టోబర్‌ 31న సైలెంట్‌గా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వ్దద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ గట్టి సౌండ్‌ చేస్తోంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలోనూ విడుదలై అద్బుతమైన రెస్పాన్స్‌ అందుకుంది. మొదటి అమరన్‌కు తెలుగులో పెద్దగా హైప్‌ లేదు. కానీ థియేటర్లోకి వచ్చాక ఈ మూవీ ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది.

విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టిన థియేటర్లో ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తుంది. మొత్తంగాఈ చిత్రం రూ. 250 కోట్ల గ్రాస్‌కు చేరువ అవుతోంది.  అయితే ఈ చిత్రం థియేటర్లో ఉండగానే ఓటీటీకి రానుందని ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొట్టింది. దీంతో డిజిట్‌ ప్రియులంతా ఈ సినిమా మరోసారి ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరిని డిసప్పాయింట్‌ చేసే ఓ అప్‌డేట్‌ బయటకువ వచ్చింది. అమరన్‌ ఓటీటీ రిలీజ్‌ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీనికి కారణం ఇదే అంటూ ఓ వార్తల బయటకు వచ్చింది.

నిజానికి మూవీ టీం అమరన్‌ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదంట. అందుకే నెలరోజుల్లోన ఓటీటీలో రిలీజ్‌ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో మూవీ విడుదలైన నెల రోజుల్లోనే అంటే నవంబర్‌ 30న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఇచ్చేయాలని మేకర్స్‌ నిర్ణయించారట. అయితే ఇప్పుడు అమరన్‌ భారీ విజయం సాధించడం, ఇప్పటికీ థియేటర్లో అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తుండటంతో… అమరన్‌ ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయాలనుకుంటున్నారట. నవంబర్‌ చివరి వారంలో రావాల్సిన ఈచిత్రం మరో రెండు వారాలు వెనక్కి వెళ్లనుందట. అంటే డిసెంబర్‌ రెండో వారం లేదా మూడో వారంలోనే అమరన్‌ను ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని టాక్‌.

ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం నిర్ణయం తీసుకుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస. అయితే దీనిపై అదికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తల్లో నిజమేంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే అమరన్‌ డిజటల్‌ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇందులో మేజర్‌ ముకుంద్‌ భార్య పాత్రలో నటించిన సాయి పల్లవి తన యాక్టింగ్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళ్లింది.

Exit mobile version