Site icon Prime9

Amaran Trailer: ‘ఆర్మీ జాబ్‌ కాదు.. లైఫ్‌’ – గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘అమరన్‌’ ట్రైలర్‌

Amaran Trailer Released: కోలీవుడ్ స్టార్‌ హీరో శివ కార్తికేయన్, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న లేటెజ్‌ మూవీ అమరన్‌. తమిళ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ పెరియ సామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తెరకెక్కిస్తున్నారు. అమరుడైన మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న తెలుగు,తమిళం భాషలో రిలీజ్‌ కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్‌ను లాంచ్‌ చేసింది.

ఆర్మీ నేపథ్యంలో సాగుతున్న ఈ ట్రైలర్‌ పూర్తి ఎమోషనల్‌ రైడ్‌గా సాగింది. ఈ ట్రైలర్‌ ఒక్కొక్కో డైలాగ్‌ మనసు హత్తుకుంటూ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. జీవీ ప్రకాష్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అయితే నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. 2.20 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఎమోషనల్‌ డైలాగ్స్‌ అద్యాంతం ఆకట్టుకుంటుంది. చిన్న పాపతో కార్తికేయన్‌ ఆడుకుంటున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత ప్లైట్‌లో కిటికి నుంచి చూస్తూ “ఈ కడలికి ఆ నింగికి మధ్య ఉన్న దూరమే నాకు తనకి…” అంటూ సాయి పల్లవి చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఆర్మీ జవాన్‌గా కార్తికేయన్ పరిచయం అయ్యారు. “44RRను నువ్వు చూస్‌ చేసుకోలేదు.. 44RRయే నిన్ను చూస్‌ చేసుకుంది” అంటూ ఆర్మీ ఆఫీసర్‌ కార్తికేయన్‌తో అంటున్న డైలాగ్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

ఆ తర్వాత ఆర్మీ కమాండర్‌తో కార్తికేయన్‌ యుద్ధంలో విజృంభించిన తీరు ఆకట్టుకుంటోంది. సీరియస్‌గా సాగుతున్న ఈ ట్రైలర్‌ మధ్యలో సాయి పల్లవి, కార్తికేయన్‌ లవ్, రొమాన్స్‌ చూపించారు. అంతేకాదు ముకుంద వరదరాజన్ ఆర్మీకి ఎలా వచ్చారు, ఈ దారి ఎంచుకోవడానికి ఆయనను ప్రొత్సహించిన సంఘటనలను ట్రైలర్‌లో ఆసక్తిగా చూపించారు. ఆర్మి అంటే జాబ్‌ కాదని.. ఇది తన లైఫ్‌ అంటూ చెప్పిన డైలాంగ్‌ హత్తుకుంటోంది. ట్రైలర్‌ చివరిలో పాకిస్తాన్‌తో యుద్ధంలో ఇందులో మేజర్ ముకుంద వరదరాజన్ పోషించిన పాత్ర, శత్రువులతో ఆయన పోరాడిన తీరు ట్రైలర్‌ చూపించిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి ప్రతి ఆడియన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. దీంతో ఇది మూవీపై మరింత హైప్‌ పెంచుతోంది.

Exit mobile version