Site icon Prime9

Amaran: ‘అమరన్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే – నెల రోజుల ముందే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..!

Amaran OTT Release Date and Streaming Details: నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి, తమిళ హీరో శివ కార్తికేయన్‌ నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘అమరన్‌’. నిజ జీవిత సంఘటన ఆధారం ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ చిత్రమైన అమరన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై అద్బుతమైన రెస్పాన్స్‌ అందుకుంది. సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లో మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. 19 రోజుల్లోనే దాదాపు రూ. 218.25 కోట్లు కలెక్ట్ చేసింది.

వరల్డో వైడ్‌గా రూ. 295 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరువలో ఉంది. ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆడియన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. అంతగా ఆకట్టుకున్న ఈసినిమాను ఓటీటీలో చూసేందుకు కూడా మూవీ లవర్స్ ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈస ఇనిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఈగర్‌ వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అమరన్‌ డిజిటల్‌ ప్రీమియర్‌ డేట్‌ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఓటీటీ ప్రియులంతా ఖుష్‌ అవుతున్నారు. అమరన్‌ డిజిటల్‌ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అన్ని భాషలకు కలిపి ఫ్యాన్సీ డిల్‌కి మేకర్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుందని ముందుగా అనుకున్నారు. ఇక సినిమా వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఓటీటీ రిలీజ్ డేట్‌ మరింత ఆలస్యం అవుతుందని భావించారు. కానీ అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తూ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ అమరన్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. నవంబర్‌ 29 నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు తమిళనాట అమరన్‌కు ఇప్పటికీ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అక్కడ రోజురోజుకు ఈ మూవీ కలెక్షన్స్‌ పెంచుకుంటూ పోతుంది.

అమరన్‌ మూవీ తమిళనాట ఇప్పటికే తమిళనాట రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు క్రియేట్‌ చేసింది అమరన్‌. ఇప్పటికే బాక్సాఫీసు వసూళ్లు అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం నెల రోజుల ముందే ఓటీటీలోకి వస్తుందని తెలిసి మూవీ లవర్స్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా అమరన్‌ మూవీని మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కశ్మీర్‌ని, అక్కడి ప్రజలను రక్షించే క్రమంలో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన ఆయన జీవిత కథను డైరెక్టర్‌ రాజ్ కుమార్ పెరియసామి అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషన్‌ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించారు.

Exit mobile version