Site icon Prime9

Prince Heroine Maria: “ప్రిన్స్” హీరోయిన్ “మరియా” గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

prince movie heroine Maria

prince movie heroine Maria

Prince Heroine Maria: న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడంలో, ఇతర భాషల్లోని నటీనటులకు అవకాశాలివ్వడంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత నుంచి మన తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ప్రపంచమంతా మన తెలుగు సినిమాలవైపు చూస్తోందనడంలో ఆశ్చర్యం లేదు. అందుకు తగ్గట్టే మన మూవీ మేకర్స్ కూడా ఇంటర్నేషనల్ హీరోయిన్లను తీసుకొస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్ను రాజమౌళి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కాగా ఇప్పుడు ఉక్రెయిన్ భామ మరియా కూడా ప్రిన్స్ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది.

తమిళ్ స్టార్ శివకార్తికేయన్ తో ‘జాతిరత్నాలు’ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ, తెలుగులో తెరకెక్కుత్తున్న ‘ప్రిన్స్’సినిమాతో మరియా ర్యాబోషప్కా కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలకు పరిచయమవుతోంది. ఈ మూవీలో మరియా హీరోయిన్ అనగానే అంతా ఆశ్చర్యపోయారు కానీ ప్రోమోస్, సాంగ్స్ లో తన అందం, అమాయకత్వం చూసి ఈ అమ్మడిలో విషయం ఉంది సిని విశ్లేషకులు అనుకున్నారు.

ఉక్రెయిన్ లో మోడల్ అయిన మరియా 2018లో ‘ఈథర్’ అనే హలీవుడ్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ను ప్రారంభించింది. తర్వాత 2012లో ‘స్పెషల్ ఓపీఎస్ 1.’ అనే హిందీ వెబ్ సిరీస్ తో భారత ప్రేక్షకులకి ఈ ముద్దుగుమ్మ పరిచయం అయ్యింది. ఇక మరియా సొంత దేశమైన ఉక్రెయిన్-రష్యాకి మధ్య యుద్ధం కారణంగా ఫ్యామిలీకి దూరమైంది. దీని గురించి ‘ప్రిన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టింది. ఈ సినిమా కోసం ఇండియా వచ్చిన వారానికే ఉక్రెయిన్ లో లాక్ డౌన్ విధించారట. దీంతో తమ ఫ్యామిలీ ఉక్రెయిన్ నుండి వలస వెళ్లిపోయారని వాపోయింది. ‘ప్రిన్స్’ మూవీ కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ ని తన దేశంలో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ఈ భామ తెలిపింది.

ఇదీ చదవండి: శివకార్తీకేయన్ ” ప్రిన్స్ ” సినిమా ట్రైలర్ అదిరిందిగా !

Exit mobile version